అగ్నివీర్‌లకు రైల్వేలో రిజర్వేషన్ సడలింపు..!

47
- Advertisement -

అగ్నివీర్‌లకు రైల్వేలో 15శాతం రిజర్వేషన్ పెంచింది. రైల్వేలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో ఈ రిజర్వేషన్‌లు వర్తిస్తాయని తెలిపింది. అంతేకాదు వయోపరిమితిలో కూడా సడలింపి ఇస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు దేహదారుఢ్య పరీక్షళ నుంచి అగ్నివీర్‌లకు మినహాయింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. దివ్యాంగులు మాజీ సైనికులు యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్-1లో 10శాతం మరియు లెవెల్-2లో అంతకు మించిన నాన్‌ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్‌లు అగ్నివీర్‌లకు కల్పిస్తారు.

Also Read: మొబైల్స్ తో జాగ్రత్త గురూ !

తొలి బ్యాచ్‌లో భాగంగా వారికి ఐదేళ్లు సడలింపు రెండవ బ్యాచ్‌లోని వారికి మూడేళ్ల చొప్పున సడలింపు ఇస్తున్నట్టు తెలిపారు. నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు లేఖలు పంపింది. భర్తీకాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని, అగ్నివీర్‌ల కోసం రిజర్వేషన్ విధానాన్ని ఆర్‌పీఎఫ్ కూడా రూపొందిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనం.

Also Read: సీబీఎస్ఈ ఫలితాలు విడుదల

- Advertisement -