‘న‌గ‌రం’ను ఆద‌రిస్తున్నందుకు థాంక్స్..

268
Regina at Nagaram Movie Successmeet
- Advertisement -

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నగరం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో హీరో సందీప్ కిష‌న్‌, హీరోయిన్ రెజీనా త‌దిత‌రులు పాల్గొన్నారు.

రెజీనా మాట్లాడుతూ – న‌గరం సినిమాకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. నేను, సందీప్ క‌లిసి చేసిన మూడో సినిమా ఇది. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డం ఎంతో హ్యాపీగా ఉంది. సినిమా త‌మిళ నెటివిటీతో ఉన్నా ప్ర‌జలు ఎంత‌గానో ఆద‌రిస్తున్నారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు సినిమాను ఎంత‌గానో ఆద‌రిస్తున్నారు. ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇలాంటి సినిమాను ఆదిరిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌“ అన్నారు.

Regina at Nagaram Movie Successmeet

సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ – “మా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హ కొన్నికార‌ణాల‌తో ఆల‌స్యంగానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమా విడుద‌ల స‌మ‌యంలో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోస‌మ‌ని మ‌లేషియాలో ఉన్నాం. అయితే సినిమా రిలీజైన త‌ర్వాత సినిమా చాలా బావుందంటూ రివ్యూస్ కూడా వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు సినిమాను ఆదరిస్తున్నారు. ఇలా ఆద‌రించ‌డానికి ఏకైక కార‌ణం కంటెంట్‌. త‌మిళంలో సినిమా మాసివ్ హిట్ అయ్యింది. తెలుగు హీరోకు త‌మిళంలో ఇంత పెద్ద హిట్ సినిమా రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. సినిమా ఇప్పుడు రెండో వారంలో ఎంట‌ర్ అయ్యింది. మ‌రిన్ని థియేట‌ర్స్ పెరిగాయి. సినిమా ఇంకా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాం“ అన్నారు.

- Advertisement -