మేడమ్ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్

230
Shreya Ghoshal's wax figure at Madame Tussauds Delhi
- Advertisement -

తన గాత్ర మాధుర్యంతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్. ఇప్పటివరకు తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న శ్రేయాఘోషల్‌ ఇప్పుడు మేడమ్ టూస్సాడ్స్‌లో కొలువుదీరనుంది. అంతర్జాతీయ వ్యాక్స్ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌ లో శ్రేయా మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

Shreya Ghoshal's wax figure at Madame Tussauds Delhi

‘మేడమ్ టుస్సాడ్స్’కు ప్రపంచ వ్యాప్తంగా 23 బ్రాంచ్ లు ఉన్నాయి. భారత్ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జూన్ లో ఈ మ్యూజియం బ్రాంచ్ ను ప్రారంభించనున్నారు. ఇక్కడ ఆమె మైనపు విగ్రహాన్ని ఉంచనున్నారు. ఈ సందర్భంగా మ్యూజియం నిర్వాహకులు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగాశ్రేయా ఘోషల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారని, ఆమె మైనపు విగ్రహాన్ని తయారు చేయాల్సిందిగా కోరుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ, పలువురు బాలీవుడ్ ప్రముఖుల మైనపు విగ్రహాలను ఇప్పటికే ఈ మ్యూజియంలో ఉంచారని, ఆ జాబితాలో తాను కూడా చేరనుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇప్పటికే ప్రధాని మోడీ, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ లాంటి సినీ సెలబ్రిటీల విగ్రహాలు ఉన్నాయి. సౌత్ నుండి ఈ అవకాశం దక్కించుకున్న తొలి సినీ స్టార్ ప్రభాస్ కావడం విశేషం.

- Advertisement -