కరోనాపై పోరు…వారంలో 2డీజీ డ్రగ్!

134
2 dg
- Advertisement -

కరోనాపై పోరులో మరో శుభవార్తను అందించింది రెడ్డీస్ ల్యాబ్. భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో రెడ్డీస్ ల్యాబ్ కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను త‌యారు చేయ‌గా.. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్.

రానున్న వారం రోజుల్లో 2 డియోక్సీ డీ గ్లూకోజ్ 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. 2-డీజీ ఔష‌ధ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి కూడా ల‌భించింది.

ఇక‌, ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధ‌ప‌డుతున్న క‌రోనా రోగులపై బాగా పనిచేస్తుందని, క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వాళ్లు త్వ‌ర‌గా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీవో వెల్లడించింది.

- Advertisement -