ఎస్‌ఎస్‌ఎంబీ మరో ఆసక్తికర అప్‌డేట్!

74
ssmb 28

ప్రిన్స్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ బాబు కెరీర్‌లో ఇది 28వ సినిమా కాగా అప్పుడే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

మే 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుండగా సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో సుశాంత్ నటిస్తున్నారనే వార్త లీక్‌ అయింది. ఓ కీలకపాత్రలో సుశాంత్ నటిస్తున్నారని పుకార్లు షికార్ చేస్తున్నాయి. సుమంత్ పాత్ర ఈ చిత్రానికి హైలెట్‌గా ఉండబోతుందట.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలా వైకుంఠపురంలో కూడా సుశాంత్ నటించిన సంగతి తెలిసిందే. 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.