దేశంలో ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జగన్:లోకేశ్

50
lokesh

ఏపీ సీఎం జగన్‌ పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేశ్. ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో స్పందించిన లోకేశ్… ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశంలో ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జగన్…ఆయన సైకో మనస్తత్వానికి ఇది నిదర్శనమన్నారు.

ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ (CID) కాస్తా సీఎం ఇండివిడ్యువ‌ల్ డిపార్ట్‌మెంట్ గా మారిపోయింది. ప్ర‌శ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.