తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు..!

238
Rebel Star to be Tamilnadu's governor?
- Advertisement -

ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు త్వరలో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పూర్తిస్థాయి గవర్నర్‌ని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. త‌మిళుల‌కు సుప‌రిచితుడ‌యిన‌, అక్క‌డి వారికి బాగా ద‌గ్గ‌రయిన‌, అక్క‌డి రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ద‌గ్గ‌రుండి ప‌రిశీలించిన వ్య‌క్తి అయితే బెట‌ర్ అని భావించిన కేంద్రం ఫైన‌ల్‌గా కృష్ణంరాజు వైపు మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది. తమిళనాడుతో కృష్ణంరాజుకు 25 ఏళ్ల అనుబంధం ఉంది.

బీజేపీ సీనియర్‌ నేతగా ఉన్న రెబల్ స్టార్‌…వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కృష్ణం రాజు పేరు దాదాపు ఖరారయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ఇంచార్జి గవర్నర్‌గా సిహెచ్ విద్యాసాగర రావు ఉన్నారు.  గత ఏడాదిలో తమిళనాడు గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసిన అనంతరం విద్యాసాగర రావు ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.

Rebel Star to be Tamilnadu's governor

కృష్ణంరాజు 1998 లో కాకినాడ నియోజకవర్గం నుండి 12 వ లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు ఎన్నికైన 42 మంది లోక్ సభ సభ్యులలో కృష్ణం రాజు అత్యధిక మెజారిటీ తో గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన కృష్ణంరాజు మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రింగా పనిచేశారు.

1970- 90 మధ్య కాలంలో అద్భుతమైన మాస్ హీరో గా తెలుగు ఇండస్ట్రిని షేక్ చేశారు. సినీ కెరీర్‌లో నాలుగు ఫిలింఫేర్ లతో పాటు రెండు నంది అవార్డులు అందుకున్న కృష్ణంరాజు తాజాగా రుద్రమదేవి చిత్రంలో గణపతి దేవుడుగా నటించారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవిది అదే ఊరు కావడం విశేషం. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత తన సొంతగూటికి బీజేపీలో చేరిపోయారు.

- Advertisement -