హ్యాపీ బర్త్ డే టు మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్

290
- Advertisement -

దిలీప్ కుమార్..ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చేమో గానీ ఏ.ఆర్. రెహమాన్ అంటే మాత్రం ప్రపంచ నలుమూలలకు ఈ సంగీత దర్శకుడు సుపరిచితం. సాంప్రదాయ, పాశ్చాత్య బాణీలను రంగరించి అటు యువతరాన్ని, నవతరాన్ని కట్టి పడేసిన మ్యూజిక్ మ్యాస్ట్రో. సంగీతంతో సంచలనాలు సృష్టించి రెండు ఆస్కార్ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకొని తన సంగీత ప్రయాణాన్ని దిగ్విజియంగా కొనసాగిస్తున్న లెజెండ్‌ రెహమాన్ పుట్టినరోజు నేడు . ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

మొజార్ట్ ఆఫ్ మద్రాస్ ఏ.ఆర్.రెహమాన్ 1967 జనవరి 6 న ఆర్ కే శేఖర్, కస్తూరి దంపతులకు తమిళనాడులోని చెన్నై లో జన్మించాడు. కీ బోర్డు ప్లేయర్ గా మొదలైన తన సంగీత ప్రయాణంలో ఎం.స్.స్వామినాథన్, ఇళయరాజ, రమేష్ నాయుడు, రాజ్-కోటి వంటి సంగీత దిగ్గజాల వద్ద శిష్యరికం చేశాడు. అయితే తన సిస్టర్ అనారోగ్య సమస్యలతో వుండగా స్నేహితుడు సలహా మేరకు ఇస్లాం మతంలో చేరి రెహమాన్ గా మారిపోయాడు దిలీప్ కుమార్.

Happy Birthday To Maestro AR Rahman

1992లో ‘రోజా’తో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమైన రెహమాన్‌…తొలిసినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమాలోని ‘చిన్ని చిన్ని ఆశ’ మెస్మరైజ్ చేశాడు. ఉషా ఉతుప్‌ లాంటి సీనియర్‌ గాయని సైతం తన షోల్లో కొన్నేళ్లపాటు ఈ పాట పాడారంటే అర్థం చేసుకోవచ్చు. తర్వాత ‘జెంటిల్‌మెన్‌’లోని ‘మావేలే మావేలే’, ‘ప్రేమికుడు’లోని ‘ఓ చెలియా నా ప్రియసఖియా’, ‘ముత్తు’లోని ‘తిల్లానా తిల్లానా’.. ఈ పాటలతో అటు యువతను, ఇటు నడి వయసు వాళ్లకి మరీ దగ్గరైపోయాడు రెహమాన్‌. భాషతో సంబంధం లేకుండా చిత్రాలకు స్వరాలు సమకూర్చారు.

ఇప్పటివరకు 4 నేషనల్ అవార్డులు,6 తమిళ నాడు స్టేట్ అవార్డ్స్,15 ఫిలింఫేర్ అవార్డ్స్ మరియు 13 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ ని కూడా అందుకున్నాడు. భారత ప్రజల చిరకాలం వాంచ ఆస్కార్‌ని అందించిన ఘనత రెహమాన్‌దే. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న రెహమాన్‌ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచాడు.

తన బర్త్‌ డే సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4.30 నుండి 5.00వరకు ప్రపంచంలో ఉన్న అందరు అభిమానులతో రెహమాన్ ఫేస్ బుక్ లైవ్‌ చాట్ చేయబోతున్నాడు. ఇందులో అభిమానులు అడిగిన అన్నిప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాడు రెహమాన్.

నమ్ముకున్న వృతి పట్ల దీక్ష ,క్రమశిక్షణ, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలన్నపట్టుదల, రెహమాన్ ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. వందేమాతరం అంటూ రెహమాన్ సమకూర్చిన ప్రత్యేక బాణి ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఎప్పటికి భారతీయుల హృదయాలలో చెరగని ముద్ర వేసింన రెహమాన్ కు బ్రెజిల్ పుట్‌బాల్ క్రీడా దిగ్గజం పీలే బయోపిక్ ‘పీలే: బర్త్ డే ఆఫ్ ఏ లెజెండ్’లో కంపోజ్ చేసిన ‘జింగా’తో మరోసారి ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని మనస్పూర్తిగా కొరుకుంటూ greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -