త్వరలో ప్రభాస్ పెళ్ళి… అమ్మాయి ఎవరో తెలుసా?

660
prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈసినిమా తర్వాత ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా  అభిమానులు ఉన్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తోన్న చిత్రం సాహో. ఈచిత్రం ఈనెల 30న తెలుగు, తమిళ్, హిందీ లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి.

ఈమూవీ విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈమూవీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రభాస్ పెళ్లి వార్తలపై కూడా అలాగే ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ప్రభాస్ పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నాడని తెలుస్తుంది.

అమెరికాలో సెటిల్‌ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్‌ పెళ్లాడనున్నాడని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కూర్చోని మాట్లాడుకున్నారని…సాహో సినిమా తర్వాత పెళ్లికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈవిషయంపై ప్రభాస్ టీం ఎటువంటి క్లారీటి ఇవ్వలేదు.

- Advertisement -