కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన మంచు లక్ష్మి…. నటిగా, నిర్మాతగా, యాంకర్ గా మంచి ఇమేజ్ పొందింది. ముఖ్యంగా ఆమె బుల్లితెరపై చేస్తున్న మేము సైతం కార్యక్రమం బాగా పాపులర్ అయ్యింది. ఎందరో అభాగ్యులకు ఆసరాగా నిలబడుతున్నఈ కార్యక్రమంలో చాలామంది సినిమా తారలు పాల్గొని తమవంతు సాయం కూడా చేస్తున్నారు.
అయితే ఇప్పుడు మంచు లక్ష్మి గురించి ఎందుకీ చర్చ అంటారా…? ఏం లేదండి…’బాహుబలి’ చిత్రంతో ప్రపంచ ఖ్యాతిని తెచ్చుకున్న దర్శకుడు ‘రాజమౌళి’ ఆ సినిమాలో ‘శివగామి’ని పాత్ర కోసం మొదట ‘మంచులక్ష్మి’ని అడిగారట. ఈ విషయం ‘రాజమౌళి’ ఎక్కడా చెప్పలేదు…కానీ…మన మంచులక్ష్మి ఒక పత్రికకు తెలిపింది. శివగామి పాత్ర నన్ను అడగడం రూమర్ కాదు నిజమే…! ‘రాఘవేంద్రరావుగారి అబ్బాయి ప్రకాష్ నాకు ఫోన్ చేసి ఆ పాత్ర ఆఫర్ చేశాడు. ఐతే వెంటనే నేను నో చెప్పాను. శివగామి ప్రాత నచ్చక ఇలా చెప్పలేదు. ప్రభాస్‌కు అమ్మగా నటించడం అనే ఆలోచన నాకు నచ్చలేదు. ఆ ఆలోచనే ఊహించలేను సినిమాలో నాకు అమ్మ ఫీలింగ్ కాకుండా ఇంకో ఫీలింగ్ వస్తే కష్టం. ప్రకాష్‌కు నో చెబుతూ రాజమౌళిని కూడా రెండు మాటలు అన్నాను. రాజమౌళి గారు ఇంకేదైనా పాత్ర ఆఫర్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను. ఐతే శివగామి పాత్రకు నా వాయిస్ మాత్రం ఇచ్చేదాన్ని. కానీ ప్రభాస్ తల్లిగా నటించడం మాత్రం నా వల్ల కాదు’అని లక్ష్మి తెలిపింది.
శివగామి భారత దేశ సినీ సంచలనం బాహుబలిలో కీలకమైన పాత్ర. దాదాపు ఈ పాత్రమీదనే సినిమా కథ మొత్తం ఆధారపడిఉంటుంది. మరి ఇలాంటి పాత్ర చేయాలంటే నటనలో చాలా అనుభవం ఉన్న నటి కావాలి… అంతే కాదు ఆ నటికి జనంలో క్రేజ్ కూడా బాగానే ఉండాలి ఆరెండూ ఉన్న నటీ నటీమణూల్లో శ్రీదేవి ఒకరు. శివగామి పాత్ర కోసం అతిలోక సుందరిని తీసుకుంటే ఎలా ఉంటుందీ అనుకున్నాడట రాజమౌళి. అయితే ఈ ఆఫర్ ను శ్రీదేవి రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమాలో టాప్ హీరోయిన్‌గా కనిపించిన తాను.. మళ్ళీ తల్లి పాత్రలో కనిపించటం ఏంటని అనుకుందో ఏమో కానీ ఈ ఆఫర్‌కి నో చెప్పేసిందట శ్రీదేవి. అంతిలోక సుందరి నో చెప్పేయటంతో మళ్ళీ బాలీవుడ్ లోనే టబూని తీసుకోవాలనుకున్నాడట రాజమౌళి. అయితే ఆ ముదురు భామకీ అమ్మ అనుపించుకోవాలనిపించలేదేమో కానీ టబూ కూడా ఈ ఆఫర్‌ని వదులుకుంది. అప్పుడు మన టాలీవుడ్ అమ్మోరు రమ్య కృష్ణని వరించింది శివగామి పాత్ర… అలా మాహిష్మతీ రాజమాత శివగామిగా రమ్యకృష్ణ కనిపించి ఆ పాత్రకు నిండుతనాన్ని తీసుకొచ్చింది.
కాగా, బాహుబలి సినిమాలో శ్రీదేవికానీ..టబు కానీ…మంచు లక్ష్మి కానీ…ఎవరు ఆ పాత్ర పోషించినా ఆ పాత్రకు న్యాయం జరిగేదికాదు..ఎందుకంటే వారి ముఖాల్లో ‘రమ్యకృష్ణ’ పలికించినంత గాంభీర్యం వారు ప్రదర్శించలేరు. మంచులక్ష్మి బాహుబలిలో శివగామి పాత్రను వదులుకొవడంతో రాజమౌళి.. ప్రభాస్‌లకు పెద్ద ప్రమాదం తప్పిందని వీరి అభిమానులు సంబరపడుతున్నారు.