`అనసూయ` ఐటెం సాంగ్ ఎందుకు చేసిందో తెలుసా..?

193
Reason Behind Anasuya Item Song
- Advertisement -

సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ముందే హాట్ యాంకర్ అనసూయకు ఆడిపాడే అవకాశం వచ్చినా నో చెప్పింది. అయితే, ఇప్పుడు మాత్రం ఐటెంగా మారిన ఆడి,పాడి అందరిని అలరించింది. సూయా సూయా అనసూయా  అంటూ విన్నర్ మూవీలో సాయిధరమ్‌తో ఈ భామ ఐటెం సాంగ్ తో ఆడిపాడేసింది.  ఈ పాటకు కు సంబంధించిన లిరికల్ వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేసేస్తోంది. అయితే, గతంలో పవన్‌ సరసన ఆడిపాడే అవకాశం వచ్చిన కాదనుకున్న అనసూయ ప్రస్తుతం ఐటెం సాంగ్‌ చేయడానికి గల కారాణాలను తెలుసుకునేందుకు అంతా ఉవ్విళ్లూరుతున్నారు.

ఇక అసలు కారణం తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురయ్యారు. తన పేరుమీద సాంగ్‌ మొదలవడంతో పాటు ఈ ఒక్క పాటకోసం ఈ జబర్దస్త్ యాంకర్‌కి ఏకంగా 25 లక్షలు ముట్టజెప్పారట. దీంతో కాదనలేకపోయిన అనసూయ ఐటెం సాంగ్‌కు ఒకే చెప్పిందట.

అంతేకాదు.. షూటింగ్ విషయంలోనూ కాస్తంత సడలింపులు ఇచ్చిందట. ఈ పాట షూటింగ్ మొత్తం పూర్తైనా.. రీషూట్ కోసం మళ్లీ కాల్షీట్లను అడ్జెస్ట్ చేసేసిందట. దీంతో అటు ఆమెకు అభినందనలూ వెల్లువెత్తాయట. మాములుగా ఐటెం భామలకు ఇది  భారీ మొత్తం రెమ్యూనరేషన్ కాకపోయినా `అనసూయ`తో సమానమైన లీగ్ లో ఉండే వారితో పోల్చితే.. ఇది చాలా భారీ మొత్తం. మరి ఈ ఐటెం భామ అనసూయ ఏ రేంజ్ లో ఆడిందో తెలియాలంటే.. ఈ నెల 24న “విన్నర్” రిలీజ్ వరకూ చూడాల్సిందే

- Advertisement -