సీబీఐ విచారణకు రెడీ..జగన్ సవాల్!

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 మరియు ఏపీపీఎస్సీ-2018 (APPSC-2018) నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.అక్రమాలు జరగలేదు కాబట్టే ధైర్యంగా సవాల్ చేస్తున్నాంతన హయాంలో లేదా గతంలో జరిగిన నియామకాలకు సంబంధించి తాము ఎలాంటి తప్పులు చేయలేదని అందుకే ఎంతో ధైర్యంగా తలెత్తుకుని సవాల్ చేస్తున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మేము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం… డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ-2018 లపై సీబీఐ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం వెంటనే లేఖ రాయాలి. నిజంగా చంద్రబాబు, లోకేష్‌లకు ధైర్యం ఉంటే సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమని లేఖ ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మాట్లాడిన తీరును జగన్ తప్పుపట్టారు. అసెంబ్లీలో వారి మాటలను పరిశీలిస్తే డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లే కనిపిస్తోందని విమర్శించారు. తప్పులు జరిగాయని తెలిసి కూడా సమాధానం చెప్పలేక గింజుకుంటున్నారే తప్ప, నిజాన్ని ఒప్పుకుని కేసును సీబీఐకి అప్పగించే ధైర్యం వారికి లేదని ఆరోపించారు. రాజకీయ ఆరోపణలు చేయడం మాని, వ్యవస్థల పారదర్శకత నిరూపణ కోసం వెంటనే ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read:ఇరాన్‌కు సాయం చేస్తే..ట్రంప్ వార్నింగ్!

- Advertisement -