ఇరాన్‌కు ఎలాంటి ఆర్థిక లేదా లాజిస్టికల్ సాయం అందించవద్దని, అలా చేస్తే ఆయా దేశాలు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఇస్లామిక్ రిపబ్లిక్‌పై జరుగుతున్న ప్రస్తుత మిలిటరీ చర్యను ఏ దేశంపైనైనా చేపట్టిన అత్యంత విధ్వంసకర ఆర్థిక ఆపరేషన్ అని ఆయన అభివర్ణించారు.
అయితే ఇరాన్ ఒక ఒప్పందం చేసుకోవడానికి తన కంటే మెరుగైన అవకాశాన్ని మరొకరు ఇవ్వలేదని 80 ఏళ్ల ఈ రిపబ్లికన్ నాయకుడు అన్నారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేనతో పాటు మొత్తం మిలిటరీ నాశనమైందని, ఆ దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిందని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.చమురు స్మగ్లింగ్, స్వ్యాప్ లైన్లు, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలు ఇవన్నీ తక్షణమే ఆగాలి అని ట్రంప్ తన సుదీర్ఘమైన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఎవరు ఈ పనులు చేస్తున్నారో వాళ్లకు తెలుసు. ఇది ఒక ‘ఎకనామిక్ డీ-డే’ (ఆర్థిక విపత్తు) కాబోతోంది. ఇరాన్ బెదిరింపులను ఒంటరిని చేసి, ఓడించడానికి మా మిత్రదేశాలన్నీ అమెరికాతో కలసి నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ ఉన్మాదులు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ చారిత్రాత్మక చర్యలు వారిని దెబ్బతీసి, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారి సామర్థ్యాన్ని భగ్నం చేస్తాయి” అని చెప్తూనే, ఇరాన్‌ను అణు ఆయుధం సాధించనివ్వబోమని పునరుద్ఘాటించారు.
Also Read:CWC:కాంగ్రెస్ నేతలపై ఖర్గే అసహనం!
ఇరాన్‌పై మరింత కఠినమైన ఆంక్షలు విధించవచ్చని హెచ్చరిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 28 నుండి మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్‌తో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అమెరికా ఈ చర్యలకు ఉపక్రమిస్తోంది. అంతకుముందు ఒక కార్యక్రమంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు, ఇరాన్‌పై విధించిన నావికా దిగ్బంధం సాధించిన గొప్ప విజయాన్ని ప్రశంసించారు. అంతరాయాలు ఏర్పడినప్పటికీ చమురు ధరలు చాలా వరకు స్థిరంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

