ఐపీఎల్ 2026 నేపథ్యంలో ఆర్సీబీ జట్టు భారీ విలువకు అమ్ముడవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రూ.450 కోట్లకు కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ ఇప్పుడు రూ.16,500 కోట్లకు చేరడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు.
2008లో తాను ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారని, క్రికెట్ జట్టులో పెట్టుబడి పెట్టడం “వైన్ ప్రాజెక్ట్” అని ఎగతాళి చేశారని మాల్యా గుర్తుచేశారు. అయితే అదే పెట్టుబడి ఇప్పుడు దాదాపు 37 రెట్లు పెరగడం తన నిర్ణయం సరైందని నిరూపించిందన్నారు.
ALso Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!
తాజాగాఆర్సీబీను ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో టైమ్స్ ఆఫ్ గ్రూప్ అలాగే బోల్ట్ వెంచర్స్ భాగస్వాములుగా ఉన్నారు. మాల్యా మాట్లాడుతూ…నా రూ.450 కోట్ల పెట్టుబడి రూ.16,500 కోట్లకు పెరగడం ఎంతో ఆనందంగా ఉంది. RCB ఎప్పటికీ నా జీవితంలో భాగంగానే ఉంటుంది. యువ ఆటగాడిగా Virat Kohliను ఎంపిక చేయడం నా కెరీర్‌లో గుర్తుండిపోయే విషయం అని పేర్కొన్నారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ డీల్‌కు ఇంకా బీసీసీఐ అనుమతులు రావాల్సి ఉంది.


