ఐపీఎల్ సీజన్‌కు ముందు జట్ల కెప్టెన్లకు ముఖ్య సూచనలు జారీ అయ్యాయి. ముఖ్యంగా క్యాచ్‌ల విషయంలో “అసంపూర్ణ (incomplete) క్యాచ్‌లు”పై కఠినంగా వ్యవహరిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
బంతి ఫీల్డర్ శరీరాన్ని తాకిన క్షణం నుంచి క్యాచ్ ప్రక్రియ ప్రారంభమై, ఫీల్డర్ బంతిపై పూర్తి నియంత్రణతో పాటు తన శరీర కదలికలపై కూడా పూర్తిగా నియంత్రణ సాధించినప్పుడు మాత్రమే క్యాచ్ పూర్తి అయినట్లు పరిగణిస్తారు. అంటే, బంతిని పట్టుకున్న తర్వాత కూడా ఫీల్డర్ సమతుల్యం కోల్పోతే లేదా పూర్తిగా నియంత్రణలో లేకపోతే, ఆ క్యాచ్ చెల్లదని భావించే అవకాశం ఉంది.
బీసీసీఐ నిర్వహించిన సమావేశంలో ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల వీడియో క్లిప్‌లు, ముఖ్యంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుండి ఉదాహరణలు చూపించారు. కొన్నింటిని “అన్యాయ క్యాచ్‌లు”గా పేర్కొంటూ, సరైన నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మాజీ అంపైర్ జవగల్ శ్రీనాథ్ మరియు అంపైర్ నితిన్ మెనన్ ఈ అంశాన్ని వివరించారు.
ఈ నియమాన్ని రాబోయే సీజన్‌లో కచ్చితంగా అమలు చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఫీల్డర్లు క్యాచ్ పూర్తి కాకముందే సెలబ్రేషన్స్ చేయడం కూడా సమస్యగా మారవచ్చని హెచ్చరించారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై కూడా చర్చ జరిగింది. ఈ నియమం కనీసం మరో రెండు సీజన్ల పాటు కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. 2027 తర్వాతే దీనిపై సమీక్ష చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Also Read:నదిలో మునిగిపోయిన బస్సు.. 18 మంది మృతి
ఈ నియమంపై అక్షర్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ రూల్ నాకు నచ్చదు. నేను ఆల్‌రౌండర్‌ను. ఇంతకుముందు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ ఆల్‌రౌండర్లను ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఈ రూల్ వల్ల జట్లు ప్రత్యేకంగా బ్యాట్స్‌మన్ లేదా బౌలర్‌ను మాత్రమే ఎంపిక చేస్తున్నాయి అని తెలిపారు. ఈ రూల్ వల్ల ఆల్‌రౌండర్ల అభివృద్ధి దెబ్బతింటోందనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. అయినప్పటికీ, బీసీసీఐ మాత్రం ప్రస్తుతం ఈ నియమాన్ని కొనసాగించడంపైనే దృష్టి పెట్టింది. మొత్తానికి, ఐపీఎల్ 2026లో క్యాచ్‌ల విషయంలో మరింత కఠిన నిర్ణయాలు, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగింపు ప్రధాన చర్చగా మారాయి.

