LPG నుండి PNGకి ఎందుకు మారాలి?

5
- Advertisement -

మధ్యప్రాచ్యంలోని యుద్ధ పరిస్థితులు భారత్‌ ఇంధన భద్రతపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మూసివేయబడటంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనితో భారత్‌ దిగుమతి గ్యాస్‌పై ఆధారపడే పరిస్థితి బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం LPG (గ్యాస్ సిలిండర్లు) నుంచి PNG (పైప్‌డ్ నేచురల్ గ్యాస్) వైపు మార్పును వేగవంతం చేస్తోంది.

మార్చి 24న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, PNG అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు 3 నెలల్లో LPG నుంచి PNGకి మారాల్సి ఉంటుంది. లేకపోతే LPG సరఫరా నిలిపివేయబడే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.భూమి అనుమతులు, ఫీజులు, హౌసింగ్ సొసైటీల అడ్డంకులను తొలగిస్తూ పైప్‌లైన్ పనులను సులభతరం చేస్తోంది. దిగుమతులపై ఆధారపడే LPG బదులుగా దేశీయంగా పంపిణీ చేసే PNG వినియోగాన్ని పెంచాలని లక్ష్యం.

గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం, నిర్వహణకు ఒకే జాతీయ విధానం అమలు చేస్తోంది. దీని ద్వారా సాధారణ ప్రజలకు ప్రయోజనాలు కలిగి ఇంధన భద్రత పెరుగుతుంది. మధ్యప్రాచ్యంపై ఆధారపడకుండానే గ్యాస్ సరఫరా కొనసాగుతుంది.

LPGతో పోలిస్తే PNG..30-40% వరకు చవకగా ఉంటుంది (ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే కనిపిస్తోంది). సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. లీకేజీ ప్రమాదాలు కూడా తక్కువ. ప్రభుత్వం LPGపై ఇస్తున్న సబ్సిడీ ఖర్చు తగ్గుతుంది. PNG, LPG కంటే కూడా శుభ్రమైన ఇంధనం.

భారత్‌ ఇంకా గ్యాస్ దిగుమతులపై ఆధారపడుతూనే ఉంటుంది.దేశవ్యాప్తంగా పైప్‌లైన్ నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకుంది.గ్రామీణ ప్రాంతాల్లో PNG అమలు కష్టం.LNG ఇంకా సముద్ర మార్గం ద్వారానే రావాల్సి ఉంటుంది. మొత్తంగా, ఈ నిర్ణయం ద్వారా భారత్‌ భవిష్యత్తులో ఇంధన సంక్షోభాలను ఎదుర్కొనేలా సన్నద్ధం అవుతోంది. LPGపై ఆధారాన్ని తగ్గించి, PNG ద్వారా స్థిరమైన, చవకైన మరియు సురక్షితమైన గ్యాస్ సరఫరాను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

Also Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!

- Advertisement -