మీరు చూసింది కాంతార 2

74
- Advertisement -

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. కన్నడలోనే కాదు విడుదలైన అన్ని భాషల్లో రికార్డు వసూళ్లను రాబట్టింది. 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. మీరు చూసింది కాంతార 2…. త్వరలో కాంతార 1 తీస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి…. ఇప్పుడు వచ్చిన కాంతార సినిమాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ చెయ్యబోతున్నాము అని చెప్పారు. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంతార సీక్వెల్ పై హీరో రిషబ్ శెట్టి చేసి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -