కొత్త రూ.500,రూ.2000 నోట్లు ఇవే…

227
note 500
- Advertisement -

నల్లధనం నిరోధించేందుకు కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రూ.500, రూ.2వేల కొత్త నోట్లు జారీ చేస్తమని ఆర్‌బీఐ ప్రకటించింది. కొత్త నోట్లు నవంబర్ 10న విడుదల చేస్తామని ఆర్‌బీఐ ప్రతినిధులు వెల్లడించారు. ఆర్‌బీఐ ప్రతినిధులు మీడియా సమావేశంలో కొత్తగా విడుదల చేయనున్న రూ.500, రూ.2వేల నోట్లను ప్రదర్శించారు. కొత్త నోట్లు నవంబర్ 10 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఆర్బీఐ ఉన్నతాధికారులు చెప్పారు.

note 1000

ఈ సందర్భంగా ఆర్ బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ మాట్లాడుతూ మధ్య, దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నోట్ల మార్పిడి విధివిధానాలను ఆర్‌బీఐ రూపొందించినట్లు వెల్లడించారు. కొత్త సిరీస్‌లో రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు జారీచేస్తం. డిపాజిట్ల స్వీకరణకు బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ లావాదేవీలు యాథాతథం. చెక్కులు, డీడీలు యథావిధిగా ఉంటాయి. ప్రస్తుతం 16.5 బిలియన్ల రూ.500 నోట్లు, 6.7 బిలియన్ల రూ.1000నోట్లు చెలామణిలో ఉన్నాయి.

note 500

విదేశీ శక్తులు నకిలీ రూ.500, రూ.1000 నోట్లను దేశంలో చెలామణి చేస్తున్నాయి. నిజమైన నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేనంతగా ఉన్నాయి. మన కరెన్సీపై ఉన్న రక్షణ పద్దతిని చేసుకోలేనప్పటికీ దొంగనోట్లు నిజమైన నోట్లను పోలి ఉన్నాయని పేర్కొన్నారు.

- Advertisement -