పాత నోట్లు ఇలా మార్చుకోండి….

232
Here’s what to do with old notes
- Advertisement -

దేశంలో బ్లాక్ మనీని అరికట్టేందుకు రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ఒక్కసారిగా తీసుకోవడంతో… గందరగోళం ఏర్పడింది. అర్ధరాత్రి వరకే ఏటీయంలు పనిచేస్తాయని తెలపడంతో.. డబ్బును డ్రా చేసుకోవడానికి జనం ఏటీయంల ముందు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలో ఏ ATM చూసినా పెద్ద ఎత్తున క్యూలు. ఒక్కసారిగా రద్దీ పెరగటంతో చాలా ఏటీఎంల్లో ఖాళీ అయ్యాయి. మరికొన్ని ఏటీఎం నుంచి అయితే వంద నోట్లు మాత్రమే వస్తున్నాయి.

మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీ నోట్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ నోట్లు కలిగిన ప్రజలు రానున్న రోజుల్లో ఏం చేయాలంటే..

()బుధవారం (నవంబర్‌ 9) నాడు అన్ని బ్యాంకులు పనిచేయబోవు.
()ప్రస్తుతం మీవద్ద ఉన్న రూ. 500, రూ. వెయ్యినోట్లను డిసెంబర్‌ 30, 2016లోపు బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్‌ చేయవచ్చు. ఇలా డిపాజిట్‌ చేసే నగదు విషయంలో ఎలాంటి పరిమితి లేదు.
()ఈ నెల 24 వరకు హేడ్‌ పోస్టాఫీస్‌ లేదా సబ్‌ పోస్టాఫీస్‌లలో గుర్తింపు కార్డు చూపించి పాత రూ. 500, రూ. వెయ్యినోట్లను బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ రూ. 4,000 పరిమితి ఉంటుంది.
()ప్రస్తుతం బ్యాంకు నుంచి ఉపసంహరించే నగదు విషయంలో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 20వేలు వరకు పరిమితి ఉంటుంది. దీనిని రానున్న రోజుల్లో పెంచవచ్చు.
()అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రూ. 500, రూ. వెయ్యినోట్ల చెలామణి అవుతాయి
()అదేవిధంగా రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, విమాన బుకింగ్‌ కౌంటర్లు, పెట్రోల్‌ బంకులలో 72 గంటల వరకు ఇవి చెలామణి అవుతాయి.
() పెట్రోలు బంకుల్లోనూ నవంబర్ 12వ తేదీ వరకు పాత నోట్లు చెల్లుబాటు అవుతాయి.
() నవంబర్ 11వ తేదీ వరకు జరిపే రూ.500, 1000లకు సంబంధించిన ప్రతీ నగదు వ్యాపార లావాదేవిలపై పెట్రోలు బంకులు, రీటేలు ఔట్‌లెట్లు నమోదు చేసుకోవాల్సి వుంటుంది.
()నగదురహిత ఆర్థిక లావాదేవీలపై ఎటువంటి ఆంక్షలు లేవు. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్స్ వంటివి యథాతథంగా జరుపుకోవచ్చు.

- Advertisement -