దేశంలో ఆర్థికాభివృద్ది వేగంగా దూసుకుపోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌ఫైవ్‌లో ఉంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న వేళ ప్రజలపై తీవ్రప్రభావం పడింది. కరోనా ఆంక్షలు దాదాపు ఎత్తివేయడంతో మళ్లీ ఆర్థిక కార్యకలాపాలు వేగంగా వృద్ధి చేందుతున్నాయి. దీంతో తాజాగా ఆర్బీఐ గణంకాలను ప్రచురించాయి.
ఆర్బీఐ ఇటీవల హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిటిక్స్ పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. దీంట్లో వేగంగా 2022యేడాదికిగాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 88శాతం పెరిగిందని తెలిపింది. బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా తర్వాత వెస్ట్ బెంగాల్ (79) ఒడిశా(67) పంజాబ్(64)శాతాల్లో ఉన్నాయి.
రాష్ట్రాల ఆర్థికాభివృద్దిలో దూసుకుపోతున్న వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా…తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. రాజస్థాన్ రెండోస్థానంలో, బిహార్ ఢిల్లీ రాష్ట్రాలు నిలిచాయి.
ఇవి కూడా చదవండి…