ఐసీఐసీఐకి షాకిచ్చిన ఆర్బీఐ

10
- Advertisement -

రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బ్యాంకులు యెస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులకు షాకిచ్చింది ఆర్బీఐ. ఈ రెండు బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. యెస్ బ్యాంక్ కు రూ. 91లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. కోటి జరిమానాను ఆర్బీఐ విధించింది.

ఈ రెండు బ్యాంకులు అనేక మార్గదర్శకాలను పాటించడం లేదని వెల్లడించింది. యెస్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్, అంతర్గత, కార్యాలయ ఖాతాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందని తెలిపింది. రుణాలు, అడ్వాన్సులు – చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్ పై ఆర్బీఐ రూ. కోటి జరిమానా విధించింది. బ్యాంక్ నిర్దిష్ట ప్రాజెక్టులకు బదులు ప్రత్యామ్నాయంగా కొన్ని సంస్థలకు టర్మ్ లోన్లను మంజూరు చేసిందని ఆర్బీఐ గుర్తించింది.

Also Read:ఈ వ్యాధి చాలా ప్రమాదం.. జాగ్రత్త!

- Advertisement -