క్యూ ఆర్‌ కోడ్‌లపై ఆర్బీఐ నిషేధం!

237
qr code
- Advertisement -

డిజిటిల్ పేమెంట్స్‌ కోసం తీసుకొచ్చిన క్యూ ఆర్ కోడ్‌లపై నిషేధం విధించింది ఆర్బీఐ. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ఇకపై డిజిటల్ పేమెంట్స్‌ లావాదేవిల్లో క్యూ ఆర్ కోడ్‌లు చెల్లవని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న యూపీఐ,క్యూ ఆర్ కోడ్‌లను మాత్రం కొనసాగించేందుకు అనుమతిచ్చింది.

మార్చి 31లోగా అన్ని పీఎస్‌వోలూ యూపీఐ, భారత్ కోడ్ లను మాత్రమే వాడాలని తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో భారత్, యూపీఐ క్యూఆర్ లతో పాటు పలు సంస్థలు సొంత కోడ్ లను వాడుతున్నాయి..

దేశంలో ఇలాంటి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ వ్యవస్థను సమీక్షించేందుకు, వివిధ సూచనలు చేసేందుకు ఆర్బీఐ దీపక్ పాటక్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్, భారత్ క్యూఆర్ కోడ్స్ కొనసాగుతాయని తెలిపింది ఆర్బీఐ.

- Advertisement -