ఈ వారం నాగ్ లేకుండానే ఎలిమినేషన్‌!

53
nagarjuna

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 7వ వారంలో ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో అభిజిత్,అరియానా,అవినాష్,మోనాల్,నోయల్,దివి ఉన్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4ను హోస్ట్ చేస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున వీకెండ్‌లో మరింత ఫన్, ఎంటర్టెయిన్మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నాగార్జున అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు మనాలీ చేరుకున్నారు. దీంతో నాగ్ స్ధానంలో మరొకరు రానుండగా ఎవరు వస్తారోనన్నది సస్పెన్స్‌గా మారింది.

ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న ఆరుగురిలో అభిజిత్ టాప్‌లో ఉండగా నోయల్, దివి లీస్ట్‌లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం బ్యాగ్ సర్దేయనుండగా ఎవరనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. తొలి వారంలో సూర్య కిరణ్,రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో స్వాతి దీక్షిత్,నాలుగో వారంలో దేవి నాగవల్లి,5వ వారంలో అనారోగ్యంతో గంగవ్వ, సుజాత ,6వ వారంలో కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు.