మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

248
gold rate
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,380కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.47,100కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి రూ 400 తగ్గి రూ.62,600కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 1904 డాలర్లుగా ఉండగా వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం క్షీణతతో 24.69 డాలర్లకు చేరింది.

- Advertisement -