హిందీలోకి రవితేజ బ్లాక్ బస్టర్?

2429
- Advertisement -

మాస్ మహారాజా లేటెస్ట్ గా ధమాకా తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీనికంటే ముందు గతేడాది ‘క్రాక్’ తో మంచి హిట్ అందుకున్నాడు రవితేజ. వరుస ఫ్లాప్స్ తర్వాత క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో రవితేజ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే రవితేజ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెసుకొచ్చిన క్రాక్ ను ఇప్పుడు హిందీలో రీమేక్ చేసే ప్లాన్ రెడీ అవుతుంది.

తెలుగులో డైరెక్ట్ చేసిన గోపీచంద్ మాలినేని హిందీలో ఈ సినిమాను హేండిల్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ రీమేక్ తెరకెక్కనుందని సమాచారం. టాగూర్ మధు మరో బాలీవుడ్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మాలినేని వీరసింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

జనవరి లో వీరసింహా రెడ్డి రిలీజ్ అయిన వెంటనే గోపీచంద్ హిందీ సినిమా మొదలు పెడతాడాని అంటున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్‌ స్క్రిప్ట్ రెడీ అవుతుంది. హిందీలో శృతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి…

మే12న కస్టడీ విడుదల

ఏప్రిల్ 28… పీఎస్‌2

ప్రభాస్‌ షో రెండు భాగాలు…

- Advertisement -