రవితేజ ధమాకా అప్‌డేట్..!

38
dhamaka
- Advertisement -

గత కొంత కాలం త‌ర్వాత క్రాక్‌తో మంచి హిట్‌ ఇచ్చాడు ర‌వితేజ‌. పాండ‌మిక్‌లో విడుద‌లైన ఈ చిత్రం భారీ వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజయం సాధించింది. ఇక అదే స్పీడ్‌లో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌ను నెల‌ల గ్యాప్‌లోనే విడుద‌ల చేశారు. అయితే ఈ రెండు చిత్రాల ఫ‌లితాలు ర‌వితేజ‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ప్ర‌స్తుతం ఈయ‌న‌ ఆశ‌ల‌న్ని ధ‌మాకా సినిమాపైనే ఉన్నాయి. త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల‌లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మేక‌ర్స్ మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

 

ధ‌మాకా మూవీ రొమాంటిక్ గ్లింప్స్‌ను బుధ‌వారం సాయంత్రం 5.01 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ర‌వితేజ‌కు జోడీగా పెళ్ళి సంద‌డి ఫేం శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ప్ర‌సన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అందిస్తున్నారు.

 

- Advertisement -