హీరోకి పెంచారు వారికి తగ్గించారు

62
- Advertisement -

గోపీచంద్ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్ పెంచేశాడని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. సహజంగానే ఒక్క హిట్ పెరగగానే హీరోలు తమ రెమ్యునరేషన్ ను పెంచుతారు. కానీ రవితేజ మాత్రం ప్లాప్ పడినా పెంచుతాడు. కింద నుంచి వచ్చిన హీరో కాబట్టి, డబ్బు పై విలువ ఎక్కువ. అందుకేనేమో ఈ మధ్య రవితేజ సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతున్నాడు. ఇంతకీ పెంచింది ఎంతంటే.. రవితేజ ప్రస్తుతం చేస్తున్న ఈగల్ సినిమాకు గానూ 23 కోట్లు ఇచ్చారని టాక్. ఇప్పుడు చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమాకు మాత్రం రూ. 27 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.

వరసపెట్టి రవితేజ హిట్స్ ఏమీ ఇవ్వడం లేదు. మరి ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఎందుకు ముందుకు రావాలి ?, అయినా నిర్మాతలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. రవితేజ అడిగినంత ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగోలా సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లి, మిగిలిన ఆర్టిస్ట్ లకు ఇచ్చే డబ్బులను తగ్గించి, అలాగే సాంకేతిక వర్గానికి చెందిన వారికీ కూడా డబ్బులు తగ్గించి, హీరోకి ఇచ్చిన అదనపు రెమ్యునరేషన్ ను కవర్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే, లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఎడిటర్ వరకూ ప్రతి ఒక్కరితో నిర్మాతలు రెమ్యునరేషన్ తగ్గించుకోమని బేరం మాట్లాడుతున్నారట.

ఏమిటో, హీరోలకు ఎక్కువ ఇవ్వడం ఎందుకు ?, కష్టపడి పని చేసే వారికీ తగ్గించడం ఎందుకు ?, శ్రమ దోపిడీ చేస్తే.. అది తమ సినిమాకు చేటు చేస్తోందని ఈ నిర్మాతలకు ఎప్పుడు అర్ధం అవుతుందో. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రవితేజ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలాగే సినిమా షూటింగ్ కూడా చాలావరకు రామోజీ ఫిలిం సిటీ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల.. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్లలో జరుపుకోనుంది. ప్రస్తుతం రవితేజ ఎంట్రీ సీన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్‌లో రవితేజ, విల‌న్‌ మధ్య యాక్షన్ సీన్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Also Read:వన్డేల్లో విరాట్ సరికొత్త చరిత్ర

- Advertisement -