ఫోర్జరీ, డేటా చౌర్యం నేరారోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. మంగళవారం 5 గంటలపాటు రవిప్రకాష్‌ని విచారించిన పోలీసులు బుధవారం కూడా విచారించనున్నారు.
తొలిరోజు విచారణకు రవిప్రకాశ్ సహకరించలేదని సమాచారం. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది.
()యాజమాన్యానికి తెలియకుండా టీవీ 9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా ..? లేదా..?
()కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది.
()శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు చీట్ చేశారు ?
()టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్థి.. టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా..? అనే ప్రశ్నలతో పాటు కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు.