సుప్రీంను ఆశ్రయించిన రవి ప్రకాష్..

359
Ravi Prakash
- Advertisement -

ఫోర్జరీ,డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంను ఆశ్రయించారు రవి ప్రకాష్. ఆయన పిటిషన్‌ను ఇవాళ విచారణకు స్వీకరించనుంది న్యాయస్ధానం. ఓ వైపు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కేంద్రంలో బీజేపీ నేతల అండదండలు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షాతో టచ్‌లో ఉన్న రవి ప్రకాష్‌..బీజేపీ పెద్దల సాయంతో గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

ఇక మరోవైపు రవిప్రకాశ్‌కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ల 160, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు.

ఇక ఏపీలోనూ రవి ప్రకాష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 30 సిమ్ కార్డులు రవి ప్రకాష్ మార్చారని పోలీసులు గుర్తించారు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ రవిప్రకాశ్‌ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు రెండుసార్లు భంగపాటే మిగిలింది.

- Advertisement -