రావణాసుర… కీలకమైన అప్‌డేట్‌

20
- Advertisement -

ధమాకా హిట్‌తో ఊపుమీదున్న రవితేజ…తాజాగా రావణాసురతో ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్దమవుతున్నారు. అభిషేక్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శాకిని డాకిని ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మేఘా ఆకాశ్, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్ష న‌గార్క‌ర్, అనూ ఇమ్మాన్యూయేల్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

రావణాసుర పోస్టర్స్ గ్లింప్స్‌ ప్రేక్షకులకు ఇప్పటికే విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో అభిషేక్ పిక్చర్స్‌ తాజాగా మరో అప్‌డేట్‌ విడుదల చేసింది. రేపు ఉదయం 10గంటల8నిమిషాలకు మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ద్వారా వస్తున్నట్టు ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. రావణాసుర సినిమాపై స్టే ట్యూన్‌డ్‌ అంటూ మేకర్స్‌ కోడ్‌ చేశారు. ధమాకా వాల్తేరు వీరయ్యతో మంచి ఫుల్‌ ఫామ్‌లోకి రావడంతో రావణాసురపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి…

వీరసింహారెడ్డి ఓటీటీలోకి ఎప్పుడంటే…

పవన్ దర్శకుడితో బెల్లంకొండ?

హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న విజయ్

- Advertisement -