ఓటీటీలోకి రాశీ ఖన్నా..!

159
rashi
- Advertisement -

ఊహలు గుసగుసలాడే చిత్రంలో తన నటనతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అందాలను రాశి పోసి పేర్చినట్లుండే రాశి ఖన్నా టాలీవుడ్ ని ఏలేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన ఇమేజ్‌ని పెంచుకుంటోంది రాశీ. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో పవర్ రోల్ పోషించబోతోందట. సీరియల్ హత్యల చుట్టూ తిరిగే కథలో రాశీ డిటెక్ట్టివ్ రోల్ పోషించబోతున్నారట. ఈ సిరీస్ “పాతాళ లోక్” మాదిరిగానే ఉంటుంది. కాకపోతే దాని కథా నేపథ్యం వేరు. ఇది వేరు అని తెలుస్తోంది.

ప్రతీ ఎపిసోడ్ 40 నిమిషాలు ఉండనుండగా 8 సిరీస్‌లుగా రిలీజ్‌ కానుందట. ఈ వెబ్ సిరీస్‌కు సూర్య వంగల దర్శకత్వం వహించనుండగా సోనీ లైవ్ ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా ఈ వెబ్ సిరీస్‌తో రాశీ ఆకట్టుకుంటుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -