తొలిప్రేమపైనే ఆశలన్నీ…

191
Rashi Khanna about Toliprema
- Advertisement -

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, మెప్పించి, అలరించిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఆ తర్వాత పలువురు యువ హీరోలతో మరియు స్టార్‌ హీరోలతో నటించే అవకాశం ఈ అమ్మడికి దక్కింది. అయితే ఈమెకు ఒక్కటైన మంచి కమర్షియల్‌ సక్సెస్‌ దక్కలేదు. అలాగే పర్వాలేదు అనిపించిన చిత్రాల్లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది.

తాజాగా రవితేజ హీరోగా నటించిన ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంపై ఈమె చాలా ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రం సక్సెస్‌ అయితే మరింతగా అవకాశాలు రావడం ఖాయం అని సినీ వర్గాల వారు కూడా భావించారు. కానీ షాకింగ్‌గా ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో పాటు సినిమాలో రాశిఖన్నా పాత్ర చెత్తగా ఉందని నెగటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. దాంతో ఆమె కెరీర్‌ ప్రమాదంలో పడ్డట్లయ్యింది.

Rashi Khanna about Toliprema

ఈనెల 10న రాశిఖన్న నటించిన మరో సినిమా ‘తొలిప్రేమ’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ సినిమాపై కూడా రాశిఖన్నా చాలా ఆశలు పెట్టుకుంది. ఒక వేళ ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అయితే రాశిఖన్నా టాలీవుడ్‌ నుండి సర్దేసుకోవాల్సిందే అని సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాశీఖన్నాకు ఏది ఏమైనా తొలి ప్రేమ సినిమా సక్సెస్ కావాల్సిందే.. ఈ సినిమా సక్సెస్ అయితేనే రాశీకి మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -