జాతిరత్నాలు దర్శకుడికి అరుదైన వ్యాధి

177
anudeep
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రీసెంట్‌గా హీరోయిన్‌ సమంత అరుదైన వ్యాధితో ఆస్పత్రిలో చేరగా తాజాగా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ సైతం ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుదీప్..తనకు హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే డిజార్డర్‌ ఉందని చెప్పుకొచ్చాడు. అందుకే నా ఫేస్ ఎక్కువగా సీరియస్ గా కనిపిస్తుంది. ఇది కామన్ గా చాలా మందిలో ఉంటుంది కానీ బయటపడదు అని చెప్పుకొచ్చారు. కాఫీ తాగితే రెండు రోజులు నిద్ర పట్టదని… గ్లూటెన్ పడదు, జ్యుస్ లు తాగలేను అని తెలిపారు.

ఒకవేళ జ్యుస్ లు తాగితే నా మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. ఏం చేస్తున్నానో అర్ధం కాదు. ఈ వ్యాధి వల్ల తొందరగా అలిసిపోతారని తెలిపారు. భవిష్యత్తులో ఈ వ్యాధి సినిమా తీస్తాను అని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -