సంపద సృష్టిలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. భారత్‌లో సంపద సృష్టిలో ముందుండే నగరాలలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ రిపోర్టు ప్రకారం రాబోయే పదేళ్లలో ఢిల్లీ,బెంగళూరులతో పాటు హైదరాబాద్ కూడా ముఖ్యపాత్ర పోషించనున్నట్లు వెల్లడించింది.ఆఫ్రేసియా బ్యాంక్, రిసెర్చ్ ఫర్మ్ న్యూ వరల్డ్ వెల్త్‌లు కలిసి గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ (జీడబ్ల్యూఎంఆర్) 2019 రూపొందించగా ఇందులో ఆసక్తికర విషయాలను పేర్కొంది.
ఫార్మాస్యూటికల్ కాపిటల్ ఆఫ్ ఇండియాగా, వివిధ రంగాలలో ఎస్‌ఈజెడ్‌లతో సంపద సృష్టిలో హైదరాబాద్ దూసుకుపోతుందని తెలిపింది. ఐటీ, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగాలలో ఆధిపత్యంతో బెంగళూరు, వివిధీకరణ, కొన్ని కీలక రంగాలలో పటిష్టత కారణంగా ఢిల్లీ నగరాలు ముందుంటాయని తెలిపింది. సంపన్నుల
అయితే గత ఏడాదితో పోలిస్తే కోటిశ్వరుల వలసలు పెరిగిపోయాయని గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ వెల్లడించింది. గతేడాది ఏకంగా 5 వేల మంది మిలియనీర్లు భారత్ వదిలి వెళ్లిపోయారని ఇదిదేశంలోని హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్‌లో 2 శాతానికి సమానమని తెలిపింది. భారత్ వదిలి వెళ్తున్న వారిలో చాలా వరకు అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తున్నారని తెలిపింది.
భారత్ ఆర్థిక పరమైన అసమానతలతో సతమతం అవుతుందని దేశంలోని సంపద కొంతమంది మిలియనీర్ల చేతుల్లోనే ఉందని పేర్కొంది. అంతేకాదు ఇండియా ఆర్థిక పరమైన అసమానతలతో సతమతం అవుతోందని, దేశంలోని మొత్తం సంపదలో సగం మిలియనీర్ల చేతుల్లోనే ఉందని పేర్కొంది. వలసలు ఇండియాకు పెద్ద సమస్య కాదని 2028 నాటికి నాలుగో సంపన్న మార్కెట్‌గా ఇండియా రూపుదిద్దుకుంటుందని అభిప్రాయపడింది.