వైసిపికి గాలం వేస్తున్న బీజేపీ..జగన్ ఎమన్నాడో తెలుసా?

200
Ys Jagan Bjp

కేంద్రంలో ఎలాగైనా మారోసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వ ఏర్పాటకు అవసరమైన మద్దతును సంపాదించే పనిలో బిజీగా ఉన్నారు కాషాయం నేతలు. ఉత్తర భారతదేశంలో బీజేపీకి బాగానే పట్టు ఉన్న దక్షిణ భారత దేశంలో మాత్రం బీజేపికి అసలు పట్టు లేదు. అందుకే ప్రాంతియ పార్టీల మద్దతు కోసం సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ బీజేపీ కూటమి నుంచి బయటకు రాగా..ప్రస్తుతం జగన్ మద్దతు కోసం గాలం వేస్తుంది.

తాము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని జగన్ కు హామి ఇచ్చినట్లు తెలుస్తుంది. కేంద్రంలో ఏ పార్టీకీ సరైన మద్దుత రాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం క్యూ కట్టాయి. ఏపికి ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తానంటే ఆపార్టీకే తాము మద్దతిస్తామని ప్రకటించారు వైసిపి అధ్యక్షుడు జగన్. ప్రత్యేక హోదా కోసం బీజేపీతో చేతులు కలిపి చంద్రబాబు….చివరకు ప్యాకేజితో సరిపెట్టుకోవడంతో బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. ఇన్ని రోజులు ఎన్డీయేకు బయట నుంచి మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేపట్టింది.

ఏపీలో మొత్తం పార్లమెంట్ స్ధానాలుండగా.. జగన్ 20సీట్లు గెలుస్తాడని అన్నీ సర్వేల్లో వెల్లడైంది. దానివల్ల కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ కీలకమవుతారని బిజెపి నాయకులు భావిస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడే వరకూ తాను కొంచెం సైలెంట్ గా ఉండాలని భావించారట జగన్. తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని భావించాడట జగన్. మే23 తర్వాత జగన్ ఎవరివైపు ఉంటాడో తెలియనుంది.