రంగస్థలం సెట్ కోసం రూ.5 కోట్లు

204
Rangasthalam There In Special Set?
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగ‌స్థలం 1985 పేరుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న‌ సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, సినిమాలో రామ్ చరణ్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తుంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నుండ‌గా, స‌మంత ప‌ల్లెటూరి పిల్ల‌గా సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ‘రంగస్థలం 1985’ చిత్రానికి అప్పుడే 51 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. శాటిలైట్ హక్కుల రూపంలో 16 కోట్లు, డిజిటల్ హక్కుల రూపంలో 13 కోట్లు నిర్మాతల చేతికి అందనున్నాయని తెలుస్తోంది. ఈ  సినిమా కోసం నిర్మాతలు ఖర్చు కోసం ఎక్కడ తగ్గట్లేదట.

Rangasthalam There In Special Set?
ఆదిత్య 369లో టైమ్‌ మెషీన్‌ ఉంటుంది కదా? అది ఎక్కితే ఎంచక్కా కోరుకున్న కాలంలోకి వెళ్లిపోవొచ్చు. అలాంటి సెట్‌నే రంగస్థలం కోసం నిర్మిస్తున్నారట.  ప్రేక్షకులను 1985 నాటి కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ని రూపొందించారు. 1985 రోజుల్లో, ఓ పల్లెటూరు ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి వాతావరణాన్ని సృష్టించారు.

కళా దర్శకుడు రామకృష్ణ రూపొందించిన ఈ సెట్‌ కోసం రూ.5 కోట్లు కేటాయించారు. ఇక్కడే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈనెల 24 నుంచి మొదలై 35 రోజులు పాటు ఇదే సెట్‌లో ఏకధాటిగా షూటింగ్‌ జరగబోతోంది. రామ్‌చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి ఇలా ప్రధాన తారాగణం మొత్తం ఈ షెడ్యూల్‌లో పాలుపంచుకోబోతోంది.

- Advertisement -