విష్ణుకు వార్నింగ్‌ ఇచ్చిన మోహన్‌బాబు….

90
Mohanbabu Warning To Manchu Vishnu On Stage

మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి…అందుకే ఆయనకు కలెక్షన్‌ కింగ్‌ అనిపేరు. హీరోగా కాకుండా నిర్మాతగా కూడా యాభైకిపైగా చిత్రాలు నిర్మించి,సక్సెస్‌పుల్‌ నిర్మాతగానే పేరు తెచ్చుకున్నాడు. మోహన్‌బాబుకు ఉన్న పాపులారిటీ తన కొడుకులైన మంచు మనోజ్‌,విష్ణుల

లేదని నెటిజన్లు కామెంట్లు విసురుతుంటారు. మంచు వారి హీరోలు ఏ ఒక్క సినిమాతో కూడా సరైన గుర్తింపు తెచ్చుకొలేదని సినీజనాలు చెవులుకొరుకుంటున్నారు.

Mohanbabu Warning To Manchu Vishnu On Stage

మోహన్‌ బాబు తెర మీదే కాదు తెరవెనుక కూడా విలక్షణంగా ఉండే నటుడే. ముక్కుసూటిగా మాట్లాడం…ఏమైన తేడా వస్తే ఎంత పెద్దవారినైన,.. చివరికి సొంత బిడ్డలనైనా నిలదీయడానికి వెనుకాడడు.తాజాగా మంచు విష్ణు నటించిన లక్కున్నోడు ఆడియో ఫంక్షన్‌లో మోహన్‌ బాబు తన కొడుకు వార్నింగ్‌ ఇచ్చాడు.

‘విష్ణు.. ఓ విషయంలో నీకు వార్నింగ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్‌ ఏ వార్నింగ్‌. భార్య, పిల్లలు ఉన్నవాడివి. ఈ మధ్యే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట నువ్వు చేసిన తప్పు చెబుతున్నాను. ‘నేను సహజంగా నా సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా వెళ్లను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పావు. అది తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నువ్వు వెళ్లాలి. ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకూ హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినపుడు తప్పక వెళ్లాలి. నేను ఎక్కడికీ వెళ్లనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు. అర్థమైందా. డబ్బాలు వద్దు మనకు. సిన్సియర్‌గా ఉండు’ అంటూ వేదిక మీదే విష్ణుకు వార్నింగ్‌తో కూడిన సూచన చేశారు మోహన్‌బాబు.

Mohanbabu Warning To Manchu Vishnu On Stage

ఇప్పటికైన మోహన్‌బాబు చెప్పినట్లు విష్ణు పద్ధతి మార్చుకోవాలని లేదంటే ముందు ముందు విష్ణుకు తిప్పలు తప్పవని నెటిజన్లు కామెంట్ల ద్వారా సూచిస్తున్నారు.