మరోసారి బాలీవుడ్‌లో భళ్ళాళ దేవ..?

262
- Advertisement -

టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం పలు భాషల్లో డిమాండ్ ఉన్న నటుడు. ‘బాహుబలి’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలతో అతడికి దేశమంతా మంచి గుర్తింపు వచ్చింది. అతడిని హీరోగా పెట్టుకుంటే ఆ సినిమాకు చాలాచోట్ల మార్కెట్ ఉంటుంది. అందుకే వేరే భాషల నుంచి అతడికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అతడితో మల్టీ లాంగ్వేజ్ సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు.

Rana Daggubati

‘బాహుబలి’ కంటే ముందే రానా బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు చేశాడు. అవి అతడికి మంచి పేరు తెచ్చాయి. ‘బాహుబలి’ తర్వాత కూడా మంచి ఆఫర్లు వచ్చాయి కానీ అతను హడావుడి పడలేదు. అయితే తాజాగా రానా ఒక హిందీ సినిమాను ఓకే చేసినట్లు సమాచారం.

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా కరణ్ జోహార్‌ నిర్మాణంలో ‘ధడక్’ సినిమా దర్శకుడు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం ‘రణ్ భూమి’ పేరిట ఓ భారీ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

- Advertisement -