వశిష్ట దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిసింది. చిరంజీవి 156 సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ‘రానా’ ప్రతినాయకుడిగా నటించనున్నారని తెలుస్తోంది. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తర్వాత, చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే, ఇందులో చిరంజీవికి ప్రతినాయకుడిగా ‘రానా’ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందులో ముగ్గురు కథానాయకులు నటిస్తుండగా, ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు.
అన్నట్టు, ఈ సినిమా పై మెగాస్టార్ ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఒకప్పటి టాలీవుడ్ పాత రూట్ నే ఎంచుకుంటూ మ్యూజిక్ వర్క్స్ ని ముందుగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే, గతంలో టాలీవుడ్ లో ఏ సినిమాకైనా ముందుగా సాంగ్స్ వర్క్ స్టార్ట్ చేసి, మ్యూజిక్ పని అయిన తర్వాత… రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే వారు. ఇప్పుడు ఇదే చిరు సినిమా కోసం రిపీట్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ పాత పద్దతినే ఫాలో కావాలి అని మెగాస్టార్ బలంగా కోరుకున్నారట. అందుకే.. ఈ సినిమా మేకర్స్ కూడా చిరంజీవి చెప్పిన విధంగానే ముందుగా పాటల పని పూర్తి చేయబోతున్నారు.
Also Read:జాన్వీ పాప మళ్ళీ కొనేసిందోచ్
ఇక ఈ మూవీ నుంచి నిన్న కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మైథలాజికల్ జానర్ లో రానున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ తోనే హై లెవెల్ హోప్స్ తెప్పిస్తున్నారు డైరెక్టర్. భూమిని పెకిలించుకుంటూ వస్తున్న త్రిశూలంతో.. చుట్టూ వలయం వంటి పర్వతాలతో పోస్టర్ అదిరిపోయింది. మొత్తమ్మీద మెగాస్టార్ చిరంజీవి నటించే తన 156 చిత్రానికి సంబంధించిన యూవీ క్రియేషన్స్ భారీగా ఖర్చు పెట్టబోతుంది.
Also Read:ప్చ్.. మహేష్ సినిమా పై నెగెటివిటీ