ప్చ్.. మహేష్ సినిమా పై నెగెటివిటీ

28
- Advertisement -

ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రమోషన్ పొందాలని సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ విడుదలకు మూడు నెలల సమయం ఉంది. పైగా చాలా గ్యాప్ తర్వాత మహేష్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి, గుంటూరు కారం పై విపరీతమైన అంచనాలున్నాయి. యాక్షన్ ప్యాకెడ్ కంటెంట్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, ఇప్పటివరకు వదిలిన పోస్టర్స్ అన్ని ఈ చిత్రంపై అంచనాలను పెంచాయి. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని మరీ ‘గుంటూరు కారం’ సినిమా పై విషాన్ని చిమ్ముతున్నారు.

‘గుంటూరు కారం’ సినిమా పై మహేష్ కే నమ్మకం లేదు అని, అందుకే, ఈ సినిమాకు సరిగ్గా డేట్స్ కూడా ఇవ్వడం లేదు అని యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. సీజీ వర్క్ క్వాలిటీ, అలాగే ఓవర్సీస్ రేట్స్ తగ్గించడం వంటి విషయాలతో ‘గుంటూరు కారం’ పై అంచనాలు తగ్గాయని.. అసలు స్క్రిప్ట్ విషయంలోనే ఎప్పుడూ లేనిది త్రివిక్రమ్ కూడా చేతులు ఎత్తేశాడని అంటున్నారు. అసలు మహేష్ స్టిల్స్, సినిమా పోస్టర్స్ ఇలా అప్పుడొకటి ఇప్పుడొకటి అప్ డేట్స్ వదిలినా సినిమాపై అంచనాలు పెరగడం లేదు అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

దీనికి ధీటుగా మహేష్ ఫాన్స్ కూడా ‘గుంటూరు కారం’ టీజర్, ట్రైలర్ వస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి.. ఆ హైప్ ఆటోమాటిక్ గా వస్తుంది అని రిప్లై ఇస్తున్నారు. కాకపోతే నెగెటివ్ అని తీసుకోకుండా అప్పుడప్పుడు పోస్టర్ వదులుతూ సినిమా విడుదలయ్యే సమయానికి బజ్ క్రియేట్ చేస్తే బావుంటుంది. మరి ఈ విషయంలో గుంటూరు కారం మేకర్స్ సరైన నిర్ణయం తీసుకుంటే బెటర్. లేకపోతే అసలకే మోసం వస్తోంది.

Also Read:Bandi:పాపం బండి.. ఈసారి కూడా డౌటే?

- Advertisement -