ఇండస్ట్రీలో వాటి కొరత ఎక్కువైపోయింది – రానా

225
Rana Daggubati presents 'C/o Kancharapalem' .
- Advertisement -

పల్లెటూరి వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని అక్కడి సామజిక అంశాల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించడం జరిగిందని, ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్తున్నాడు రానా. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న “కేరాఫ్ కంచెరపాలెం” చిత్రం సెప్టెంబర్ 7 న విడుదల కాబోతుంది. వెంకటేష్ మహ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ పరుచూరి గారు నిర్మిస్తున్నారు.

Rana Daggubati presents 'C/o Kancharapalem'

ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన రానా ఇండస్ట్రీలో కథల కొరత ఎక్కువైపోయిందని, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఏడాదికి దాదాపు 5 వేల కథల్ని వింటున్నామని, కానీ కేవలం 4,5 కథలు మాత్రమే కార్య రూపం దాల్చుతున్నాయని, కథల్లో సృజనాత్మకత లేమి, ఇండస్ట్రీ లో చక్కటి ప్రతిభావంతుల లేమి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాడు.

Rana Daggubati presents 'C/o Kancharapalem' .

ఇక ఈ సినిమా విషయాలను ఆరాతీస్తే “నేను ఇంతకు ముందు బొమ్మలాట సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాను,ఆ సినిమా జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉన్నాయ్.” అని నమ్మకంగా చెప్తున్నాడు రానా. అంతేకాదు ఈ సినిమాలో కంచెరపాలెం యొక్క సహజత్వం ఏ మాత్రం తగ్గకూడదని ఆ ఊరి జనాన్నే ఈ సినిమాలో నటులుగా తీసుకున్నట్టు చెప్పాడు రానా. నాలుగు ప్రేమకథలు మధ్య సాగే ఈ సినిమా ఎంతో కళాత్మకంగా రూపొందించబడిందని, అందరికీ నచ్చుతుందని చెప్పి సినిమా యొక్క అంచనాలను పెంచే ప్రయత్నం చేసాడు రానా . మరి సెప్టెంబర్ 7 న విడుదల కాబోతున్న ఈ సినిమా రానా నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి మరి.

- Advertisement -