నిన్నటితరం కథానాయికగా తెలుగు తెరపై వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. చిరంజీవి,బాలకృష్ణ ,వెంకటేశ్,రజనీకాంత్ వంటి సీనియర్ హీరోల సరసన నటించి హిట్ కొట్టిన నిలాంబరి వయసు తగ్గిన ఏ మాత్రం తగ్గేది లేదని చెబుతోంది. లేటు వయసులో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో రీఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ బాహుబలిలో శివగామిగా విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.
తాజాగా రమ్యకృష్ణ …జే ఎఫ్ డబ్ల్యూ మేగజైన్ ముఖచిత్రంపై మెరిసింది. ఈ మేగజైన్ ముఖచిత్రం పై ఆమె లుక్ ను .. ఇచ్చిన స్టిల్ చూసిన వాళ్లంతా ‘వావ్’ అంటున్నారు. 46 సంవత్సరాల వయసులోను ఆమె ఇంత గ్లామరస్ గా కనిపిస్తూ ఉండటం రియల్లీ గ్రేట్ అంటున్నారు.
నాగ్ సరసన సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోయిన్‌గా నటించి.. ఆ సినిమాలోని అరడజను మంది అమ్మాయిలకు పోటీని ఇచ్చిన రమ్య.. తాజా లుక్‌తో సీనియర్ హీరోల సరసన చక్కగా అమరేలా ఉంది ఈ లుక్‌లో. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ టాప్‌హీరోలు మళ్లీ రమ్యతో జతకడితే.. ఆ కాంబో ప్రత్యేక ఆకర్షణే అవుతుందని అంటున్నారు టాలీవుడ్ జనాలు.