రాజకీయాల్లోకి ఆ హీరో-ఈ హీరోయిన్?

37
- Advertisement -

రాజకీయాలకు సినిమా వాళ్ళకు విడదీయలేని బంధం ఉంది. ఆంధ్రలో ఎన్టీఆర్.. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో స్టార్ కూడా రాజకీయ తెరపై తనదైన ముద్ర వేయాలని కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై మరో హీరో విశాల్ తనదైన శైలిలో స్పందించాడు. విజయ్ రాజకీయాల్లోకి వస్తే మనసారా అభినందిస్తానని చెప్పాడు.

మంచి ఆలోచనలతో ప్రజాదరణ పొందే విధంగా విజయ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. కోలీవుడ్ లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. అలాగే మాజీ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా రాజకీయాల పై క్రేజీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి లేదని, కానీ రేపటి రోజు ఏమైనా జరగవచ్చునని రమ్యకృష్ణ సందేహాస్పదంగా అన్నారు.

Also Read:Nagma:నాకు ఓ తోడు కావాలి

రమ్యకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. తాను, రోజా మంచి స్నేహితులమని, తిరుమలలో మంచి దర్శనం చేయించినందుకు, రోజాకి ధన్యవాదాలు చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్లానని రమ్యకృష్ణ వివరణ ఇచ్చారు. రాజకీయాలు అనే అంశం వచ్చే సరికి ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని నర్మగర్భంగా రమ్యకృష్ణ అన్నారు. తమిళ రాజకీయాల పట్ల రమ్యకృష్ణ ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి నటీనటులు రావడం కొత్తేమీ కాదు. తాజాగా తమిళ సినీ పరిశ్రమ నుంచి మరి కొందరు రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారట. మరి వీరంతా విజయ్ పార్టీలో చేరతారేమో చూడాలి.

Also Read:చింతచిగురుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

 

- Advertisement -