ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడిని పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నియామకంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీచీఫ్‌గా న్న కళా వెంకట్రావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఏపీకి కొత్త అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకే చెందిన రామ్మోహన్ నాయుడిని ఎంపిక చేసినట్లు సమాచారం. బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో పాటు పార్టీకి లాయల్‌గా ఉండటం ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్‌నాయుడు 6,653 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంపీగా గెలుపొందడం రామ్మోహన్ నాయుడికి ఇది రెండోసారి. ఆయన తండ్రి ఎర్రనాయుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మరణంతర్వాత రాజకీయవారసుడిగా ఆరంగేట్రం చేసిన రామ్మోహన్ నాయుడు తన పనితీరుతో ప్రజలతో పాటు పార్టీ నేతలను ఆకట్టుకున్నారు. రామ్మోహన్ బాబాయ్ అచ్చన్నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.