మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేదం తర్వాత ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. భారీ మొత్తంలో ఫాలోవర్స్ ఉన్న సీఎస్కే సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ప్రతి మ్యాచ్ అనంతరం ఆ మ్యాచ్ లోని విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. కానీ మొన్న ముంబై-చెన్నై మ్యాచ్ అనంతరం సీఎస్కే చేసిన పోస్టు క్రికెట్ అభిమానుల ఆగ్రహాని చవిచూసింది.
క్యాడ్బరీ ఫైవ్ స్టార్ చాకోలెట్ యాడ్ మాదిరిగా కామెడీ చెద్దామనుకుంది సీఎస్కే. కానీ బెడిసి కొట్టింది. సచిన్ తో కలిసి సురేశ్ రైనా మెట్లెక్కుతూ వస్తోన్న ఫోటోను సీఎస్కే ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి రమేష్ అండ్ సురేష్ అనే క్యాప్షన్ కూడా తగిలించింది. సచిన్ పూర్తి పేరు రమేశ్ టెండుల్కర్ కాగా… రమేష్ అనేది ఆయన తండ్రి పేరు. చనిపోయిన సచిన్ తండ్రి పేరును ఇలా వాడతారా…?మీకు బుద్దిందా..? క్రికెట్ దేవుడిపైనే జోకులా అంటూ ఫ్యాన్స్ సీఎస్కేపై మండిపడుతున్నారు.
మరోవైపు చెన్నై జట్టు అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ లో అత్యధిక టీ20ల్లో విజయం సాధించిన రెండో జట్టుగా నిలిచింది. పుణె వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ఈ రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ లో ఇప్పటి వరకు చెన్నై 100 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ 104 మ్యాచ్ లలో విజయం సాధించి ప్రథమ స్థానంలో కొనసాగుతుంది.
Ramesh and Suresh 😍#whistlepodu pic.twitter.com/MIPjSmb88g
— Chennai Super Kings (@ChennaiIPL) April 29, 2018