సశాంత్..పెళ్లి ఎప్పుడో తెలుసా..!

237
Concept Poster of Sushanth ..Chi La Sow
- Advertisement -

సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం “చి ల సౌ”. ఈ చిత్రాన్ని జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్నారు. సుశాంత్ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా తాజాగా సినిమా కథను పోస్టర్‌ని విడుదల చేశారు.

నాగా చైతన్య ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. పోస్టర్‌లో శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు,త్వరగా పెళ్లిచేసుకో,పెళ్ళి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది,గర్ల్ ఫ్రండ్‌ని కనిపెట్టు,లైన్లో నెక్ట్స్ నువ్వే,ఒక ఇంటి వాడివి ఎప్పుడు అవుతావ్,ఎక్కాల్సిన బస్‌ మిస్‌కాకు,పెళ్ళి చేసుకోరా,పెళ్లి ఎప్పుడు అంటూ రాసిన కాప్షన్స్‌ సినిమా కథ ఎంటో చెబుతున్నాయి.

షూటింగ్ పార్ట్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Concept Poster of Sushanth ..Chi La Sow

సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అనుహాసన్, రాహుల్ రామకృష్ణ, జయప్రకాష్, విద్యుల్లేఖ, సంజయ్ స్వరూప్, హరీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్స్: రవికుమార్ యండమూరి-వాసిరెడ్డి, చీఫ్ కో డైరెక్టర్: డి.సాయికృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ శర్మ (వివి), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ ఆర్.విహారి, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, నిర్మాత: జస్వంత్ నడిపల్లి, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.

- Advertisement -