‘వారసుడు’ చూసిన రామ్ చరణ్ ?

15
- Advertisement -

ఈ సంక్రాంతి కి ‘వాల్తేరు వీరయ్య ‘, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో పాటు ‘వారసుడు’, ‘తెగింపు’ కూడా డబ్బింగ్ మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇందులో వారసుడు మీద తెలుగులో మోస్తారు అంచనాలున్నాయి. దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడం , వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కొంత ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా చూశాడని తెలుస్తుంది.

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ పొలిటికల్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రషెస్ చూసేందుకు తమన్ స్టూడియో కి వెళ్ళిన చరణ్ అక్కడ విజయ్ వారసుడు టెస్ట్ షో జరుగుతుండటంతో సినిమా మొత్తం చూశాడాని సమాచారం. సినిమా చూసిన అనంతరం నిర్మాత దిల్ రాజు , వంశీ పైడపల్లి , తమన్ లను చరణ్ అభినందించాడట.

వారసుడు కి తెలుగులో దిల్ రాజు ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెగా ఫ్యాన్స్ ఉత్తరాంధ్రలో చిరంజీవి సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదని దిల్ రాజు పై అక్కసుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ వారసుడు సినిమా చూసి టీంను మెచ్చుకున్నాడనే వార్త మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -