అన్నగారు వైపే బాలయ్య

47
- Advertisement -

మొత్తానికి బాలయ్య- అనిల్ రావిపూడి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లే. అన్నగారు టైటిల్ నే ఫిక్స్ చేసారని బోగట్టా. ఈ టైటిల్ తో పాటు మరి కొన్ని టైటిల్స్ వినిపించాయి కానీ ఈ టైటిల్ కే అనిల్ రావిపూడి – బాలయ్య మొగ్గు చూపారు. దాంతో ఈ టైటిల్ నే అనౌన్స్ చేయబోతున్నారు. పలనాడు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను అనిల్ రాసుకున్నారు. పక్కా మాస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తయారవుతోంది. అనిల్ రావిపూడి స్టయిల్ కామెడీ ఎలిమెంట్స్ సినిమా నిండా పరుచుకుంటాయని తెలుస్తోంది.

అలాగే బాలయ్య శైలి యాక్షన్ కూడా సినిమాలో హైలైట్ గా నిలుస్తోందట. ఇక పొలిటికల్ పంచ్ లు కూడా వుంటాయని టాక్. నందమూరి ఫ్యాన్స్ ఊతపదం అన్నగారు. సీనియర్ ఎన్టీఆర్ గారిని అందరూ అన్నగారు అని పిస్తుంటారు. కాబట్టి.. బాలయ్య సినిమాకు అంతకన్నా క్యాచీ టైటిల్ వుండదు. అందుకే అన్నగారు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. అఖండ, వీర సింహ రెడ్డి సినిమాలతో బాలయ్య సినిమాలకు హాట్ ఫేవరెట్ అయిపోయిన ధమన్ నే ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు.

అనిల్ రావిపూడి ఆల్ రెడీ హీరోయిన్స్ ను కూడా ఫైనల్ చేశారు. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్యకి కూతురుగా నటిస్తోంది. ఐతే ఈ సినిమాలో కథానాయిక ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. నిజానికి ఈ సినిమాకు ముందుగా జై బాలయ్య అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ మళ్లీ ఆ టైటిల్ గోపీచంద్ మలినేని సినిమాకు అని వినిపించింది. మొత్తానికి అనిల్ రావిపూడి సినిమాకు మాత్రం అన్నగారునే ఫిక్స్ చేసారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -