హేయ్ ఎన్టీఆర్ అన్న నీ సవాల్ స్వీకరించా..

163
- Advertisement -

భారతీయులు ఆరోగ్యంగా ఉండాలనే ఉదేశ్యంలో క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ మొదలు పెట్టిన ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ ‘ ఛాలెంజ్‏కి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‏లో సినీ తారలు, క్రికెటర్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన సవాల్‏ను చరణ్ స్వీకరించాడు.

ఇక రామ్ చరణ్ వ్యాయామం చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. హేయ్ ఎన్టీఆర్ అన్న.. నీ సవాల్‏ను స్వీకరించా. ఇక కేటీఆర్, సందీప్ కోశ్లా, శోభనా కామినేని, సుకుమార్, వరుణ్‏తేజ్, మన మెగాస్టార్‏కు ఛాలెంజ్ విసురుతున్నా అంటూ తన ఫేస్‏బుక్‏లో పోస్ట్ చేశాడు. ఇక అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య విసిరిన సవాల్‏ను అఖిల్ స్వీకరించిన సంగతి తెలిసిందే.

మరోవైపు విరాట్ కోహ్లీ తాను వ్యాయామం చేస్తున్న వీడియోని ప్రధాని మోడీకి ట్యాగ్ చేస్తూ… సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ పోస్టుకు ప్రధాని సైతం మిస్టర్ కోహ్లీ త్వరలోనే నేను యోగా చేస్తున్న వీడియోని చూస్తారు అంటూ రిప్లై కూడా ఇచ్చారు. మరీ ప్రధాని ఎప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాడో వేచి చూడాలి ఇక.

- Advertisement -