కొజ్జెపల్లి వాసుల కోరిక నెరవేరబోతోంది…

242
kojjepalli

గత కొన్ని సంవత్సరాలుగా మా ఊరు పేరు మార్చండి బాబోయ్ అంటూ మొరపెట్టుకున్న ఆ ఊరు జనాలకు శుభవార్త అందింది. ఊరు పేరు మార్చుకోవాలన్న ఆ ఊరు జనాల కోరిక నెరవేర బోతోంది. ఎవరైనా ఊరు పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఆ ఊరు ప్రజలు మాత్రం తమ ఊరు పేరు చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అందరూ నవ్వుకుంటారని ఆ ఊరు జనాలు ఆవేదన చెందుతున్నారు. ఇంతకి ఆ ఊరు పేరు ఏంటి.. అదెక్కడుంది అనే కదా మీ సందేశం. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఉంది కొజ్జేపల్లి అనే గ్రామం.

Kojjepalli

అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊళ్లో ఎక్కువగా హిజ్రాలు ఉండడంతో.. అందరూ ఆ ఊరుని కొజ్జేపల్లి అని పిలుస్తూ వచ్చారు. అది అలాగే నేటికి కంటిన్యూ అవుతోంది. ఆ ఊరు జనాల వినతి మేరకు జిల్లా రెవెన్యూ అధికారి సంఘనాథం స్పందించారు. గ్రామం పేరు మార్చుకునే వెలుసుబాటు ఉందని చెప్పారు. ముందుగా గ్రామం పేరు మార్చుకోవాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలని చెప్పారు. అనంతరం గెజిట్ కోసం జిల్లా కలెక్టర్ కు ఆర్జీ పెట్టుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఆర్డీఓకు ఆర్జీ అందుతుందని, అక్కడి నుంచి తహసీల్దార్ కు ఆర్జీ వెళ్తుందని చెప్పుకొచ్చారు.

అనంతరం తహసీర్ధార్ మీ గ్రామానికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి.. మీ గ్రామానికి ఏ పేరు పెట్టాలనుకుంటారో తెలుకుని.. మీరు సూచించిన పేరు జిల్లాలో ఏ ఊరు పేరు లేకుంటే.. ఆ పేరునే సిఫారసు చేస్తారని చెప్పారు. ఆ తర్వాత పూర్తి నివేదికను కలెక్టర్ కు సమర్పించి, ప్రభుత్వానికి పంపుతారని తెలిపారు. ఆ నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత… గెజిట్ జారీ చేస్తుందని, అప్పుడే అధికారికంగా ఊరు పేరు మారి.. కొత్త పేరు రికార్డుల్లోకి ఎక్కుతుందని చెప్పారు.